Type Anything.., You Get World Wide Search Results Here. !

మూడు చేపల కథ - A Tale Of Three Fishes - Telugu Moral Stories

మూడు చేపల కథ - A Tale Of Three Fishes - Telugu Moral Stories

అనగనగా ఒక చెరువు లొ చాల చేపలు వుండేవి. ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళు ఆ చెరువు దెగ్గిరనుంచి వెళ్ళారు. చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మన్నాడు ఆ చెరువు లో చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.


వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకొ రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువు ని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని వివరించింది.


ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి. రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అనుకుంది.


మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అద్రుష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు” అనుకుంది.


మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది. తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుతుంబం తో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.


మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకో గలిగింది. ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండొ చేప కొంత వరకు తన కుటుంబాన్ని కాపడుకుంది.


ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు యేమి చేయలేక పొయింది. అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చేయకపోతే, లాభం ఫలించదు.




Top

Bottom