అలవాటు - Habit - Telugu Moral Stories
ఒక వూళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వేరే వాళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది.
ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ.
సూరమ్మ పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది.
మీకేమైన తెలిసిందా? సూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.
